16400ని తాకిన నిఫ్టి
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా అధిక నష్టాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 16409ని తాకింది. ప్రస్తుతం 16414 వద్ద 158 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. సెన్సెక్స్ 526 పాయింట్లు నష్టంతో ఉంది. దాదాపు అన్ని సూచీలు ఒక శాతం నష్టంతో ఉన్నాయి. నిఫ్టిలో ఏకంగా 45 షేర్లు నష్టంతో ఉన్నాయి. కేవలం అయిదు షేర్లు లాభాల్లో ఉన్నా… ఒక్క ఓఎన్జీసీ మాత్రమే ఒక శాతం లాభంతో ఉంది.ఈ షేర్ పెరగడానికి ప్రధాన కారణం క్రూడ్ ధరలు అధికంగా ఉండటం. ఇదే కారణంగా ఏషియన్ ఎయింట్స్ రూ. 2750కి చేరింది. మొన్నటి దాకా ఈ షేర్ రూ. 3100 వద్ద ట్రేడయ్యేది. టైటాన్ 4 శాతం నష్టంతో ఉంది.పీబీ ఫిన్‌టెక్ 9 శాతం నష్టంతో ట్రేడవుతోంది.