For Money

Business News

NIFTY TODAY: 16461 కీలకం

మార్కెట్‌ ఇవాళ బలహీనంగా ప్రారంభం కానుంది. కనీసం వంద పాయింట్ల నష్టంతో ప్రారంభం కావొచ్చు. నిఫ్టి క్రితం ముగింపు 16.569. నిఫ్టి లెవెల్స్‌ చూసినట్లయితే నిఫ్టికి ఇవాళ 16461 కీలకం. ఈ స్థాయి దిగువకు వెళితే నిఫ్టిలో అధిక ఒత్తిడి కన్పించవచ్చు. రేపు ఆర్బీఐ పరపతి విధానం వెల్లడికానుంది. టెక్నికల్‌ సిగ్నల్స్‌ కొనుగోలుకు సంకేతాలు ఇస్తున్నాయి.. అవి దిగువస్థాయిలోనే. స్వల్ప కాలానికి సెల్ సిగ్నల్‌ ఇస్తున్నాయి. ఓపెనింగ్‌లోనే నష్టాల్లో ప్రారంభం అవుతున్నందున దిగువ స్థాయిలో నిఫ్టికి మద్దతు అందే అవకాశాలు ఉన్నాయి. నిఫ్టికి ఇవాళ్టి కీలక స్థాయిలు..
అప్‌ బ్రేకౌట్‌ – 16678
రెండో ప్రతిఘటన – 16650
తొలి ప్రతిఘటన – 16632
నిఫ్టికి కీలకం – 16542
తొలి మద్దతు – 16507
రెండో మద్దతు – 16489
డౌన్ బ్రేకౌట్‌ – 16461