ఆన్లైన్ బుకింగ్ డబుల్
ఆన్లైన్ టిక్కెట్ల సంఖ్యను పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. యాప్ లేదా వెబ్సైట్లో ఆన్లైన్లో టిక్కెట్ బుకింగ్ ఇపుడున్న దానికి రెట్టింపు చేసింది. ప్రయాణీకుల సౌలభ్యం కోసం ఒక ఐడీపై ప్రస్తుతమున్న దాని కంటే ఎక్కువ టిక్కెట్లనే బుక్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసుకోవాలంటే ఆధార్ లింక్ చేసుకున్న వారికి మాత్రమే తమ ఐడీపై నెలకు గరిష్టంగా 24 టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇంతకుమునుపు ఈ పరిమితి 12 టిక్కెట్లు మాత్రమే. యాప్‌కు లేదా వెబ్‌సైట్‌కు ఆధార్ లింక్ చేసుకోని యూజర్ మాత్రం 12 టిక్కెట్ల వరకు బుక్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇంతకు ముందు ఈ పరిమితి 6 టిక్కెట్లు. సో.. తరుచూ రైల్వే ద్వారా ప్రయాణం చేసేవారు ఐఆర్సీటీసి అకౌంట్‌కు ఆధార్ లింక్ చేసుకోవడం మంచిదన్నమాట.