For Money

Business News

ఆల్‌ టైమ్‌ కనిష్ఠ స్థాయికి ఎల్‌ఐసీ షేర్‌

ఎల్‌ఐసీ షేర్‌ పెరగడం అటుంచి… ప్రతి రోజూ ఎంతో కొంత పడుతూ వస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు భారీగానష్టపోయారు. చివరికి పాలసీ హోల్డర్లకు కూడా భారీ నష్టాలు తప్పడం. లిస్టింగ్‌ తరవాత కంపెనీ షేర్‌ ఇష్యూ ధరకు రావడం అటుంచి… ఫలితాలకు కూడా స్పందించలేదు. మే 17న రూ. 918.95ని తాకిన ఎల్‌ఐసీ షేర్‌ 18 రోజుల్లోనే రూ. 786.10కి క్షీణించింది. మార్కెట్‌ బలహీనంగా షేర్‌ పడుతుంది. మార్కెట్‌ కోలుకున్నపుడు మాత్రం కోలుకవోడం లేదు. దీంతో క్రమంగా కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ తగ్గుతూ వస్తోంది. నిజానికి ఈ కంపెనీ మార్కెట్‌ విలువ రూ.16 లక్షల కోట్లని తొలుత ప్రచారం చేశారు. భారీ డిస్కౌంట్‌తో షేర్లను జారీ చేస్తున్నామని అన్నారు. ఇపుడు ఎల్‌ఐసీ మార్కెట్‌ విలువ రూ. 5 లక్షల కోట్ల లోపుకు పడిపోయింది.