వడ్డీ రేటు అర శాతం పెంపు?
ఆర్బీఐ పాలసీ మానిటరింగ్ కమిటీ (పీఎంసీ) సమావేశం ఇవాళ ప్రారంభం కానుంది. దేశంలో ఆర్థిక పరిస్థితిని మూడురోజుల పాటు సమీక్షించి బుధవారం విధాన నిర్ణయాన్ని ప్రకటించనుంది. గత సమావేశంలో వడ్డీరేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తరవాత అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి 0.4 శాతం మేర రెపో రేటును పెంచింది. బుధవారం వడ్డీ రేట్లను ఆర్బీఐ మళ్ళీ పెంచే అవకాశముంది. ఈసారి ఆర్బీఐ అరశాతం మేర వడ్డీ రేట్లను పెంచుతుందని ఎకనామిక్ టైమ్స్ పత్రిక జరిపిన సర్వేలో పాల్గొన్న నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ స్థాయిలో పెంపు ఉండకపోవచ్చని.. కాస్త తక్కువే ఉండొచ్చిన బ్యాంకర్లు భావిస్తున్నారు. పెట్రోల్, డీజిల్పై పన్ను తగ్గించడంతో పాటు సాధారణ వర్షం పాతం ఉంటుందని భారత వాతావరణ శాఖ ప్రకటించడంతో ఆర్బీఐ స్వల్పంగానే వడ్డీ రేట్లను పెంచవచ్చని వీరు భావిస్తున్నారు.