For Money

Business News

16500 దిగువకు నిఫ్టి

ఉదయం ఒక మోస్తరు లాభాలతో ప్రారంభమైన నిఫ్టి.. సెషన్‌ కొనసాగే కొద్దీ బలహీనపడుతూ వచ్చింది. నిఫ్టికి 16475 ప్రాంతంలో మద్దతు అందాలి. లేనిపక్షంలో మరింత బలహీనపడే అవకాశముంది. ప్రస్తుతం 16476ని తాకి స్వల్పంగా కోలుకుని 16490 వద్ద ట్రేడవుతోంది. 95 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టి ఏకంగా 38 షేర్లు నష్టంతో ఉన్నాయి. లాభాల్లో ఉన్న షేర్లు నామమాత్రపు లాభాలతో ఉండగా, నష్టపోయిన షేర్లు భారీగా దెబ్బతిన్నాయి. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ మాత్రం పటిష్ఠంగా ఉంది. దాదాపు క్రితం స్థాయలో ఉంది. అయితే నిఫ్టి నెక్ట్స్‌ సూచీ ఒక శాతంపైగా నష్టపోయింది. అదానీ ట్రాన్స్‌మిషన్‌, నైకా, పీఈఎల్‌, బెర్జర్‌ పెయింట్స్‌, అదానీ గ్రీన్‌ షేర్ల నుంచి ఈ సూచీపై అధిక ఒత్తిడి వస్తోంది. మరోవైపు యూరో మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. లాభానష్టాల్లో పెద్ద మార్పు లేదు. ఆసియా మార్కెట్లు కూడా అదే ధోరణితో ఉన్నాయి. ఈ లెక్కన నిఫ్టి రెండో సెషన్‌లో కోలుకుంటుందేమో చూడాలి.