ఓపెనింగ్: 16600పైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి లాభాల్లో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 16632ను తాకింది. ఇపుడు 16611 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే27 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టి బ్యాంక్ దాదాపు క్రితం స్థాయి వద్దే ఉంది. నిఫ్టి మిడ్ క్యాప్ అర శాతం లాభంతోఉంది. టైటాన్ టాప్ గెయినర్‌గా ఉంది. హిందాల్కో టాప్ లూజర్‌గా ఉంది. రియాల్టి ఓకే. ఐటీ ముఖ్యంగా మిడ్‌క్యాప్ ఐటీ షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. జొమాటొ ఇవాళ కూడా 5 శాతం పెరిగింది. కొన్ని సెషన్స్‌లోనే రూ. 58 నుంచి రూ. 78కి చేరింది. అలాగే నైకా కూడా 3 శాతం లాభంతో ఉంది.ఇవాళ కూడా మార్కెట్ నిస్తేజంగా ఉంటుందని, పెద్దగా మార్పులు ఉండవని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని అన్నారు. ఒకవేళ ఎవరైనా ట్రేడ్ చేయదలిస్తే నిఫ్టి 16400 ప్రాంతానికి వచ్చే వరకు ఆగి కొనుగోలు చేయొచ్చని ఆయన సలహా ఇచ్చారు.