టెక్ వ్యూ… బుల్స్వైపే మొగ్గు
నిఫ్టి డెయిలీ చార్ట్స్‌పై లాంగ్ లెగ్డ్ డోజి ఏర్పడింది. అంటే ట్రేడర్స్‌లో అనిశ్చితి ఉందన్నమాట. ఈ పరిస్థితిని అధిగమించి మార్కెట్ ముందుకు సాగే అవకాశాలే అధికంగా ఉన్నాయని టెక్నికల్ అనలిస్టులు అంటున్నారు. అయితే ఒక మోస్తరు ర్యాలీ తరవాత మార్కెట్ నిలదొక్కుకునే ప్రయత్నం చేయడం సహజమని అంటున్నారు. ఇక ఎఫ్ అండ్ ఓ విభాగంలో ట్రేడింగ్ ట్రెండ్‌ను గమనిస్తే… కాల్ వైపు మొగ్గు కన్పిస్తోంది. నిఫ్టి 17000 జూన్ కాంట్రాక్ట్‌లో ఓపెన్ ఇంటెరెస్ట్ భారీగా పెరిగింది. తరవాత 17200 కాల్ రైటింగ్ జరుగుతోంది. అదే సమయంలో 16000 కాంట్రాక్ట్‌లో పుట్ రైటింగ్ బాగా ఉంది. అలాగే 16500 వద్ద కూడా పుట్ రైటింగ్ అధికంగా ఉంది. ఒకవిధంగా ఈ శ్రేణిని మద్దతు స్థాయిగా భావించవచ్చు. మూమెంటమ్ ఇండికేటర్ MACD (Moving Average Convergence Divergence)ని చూస్తే బీఎస్ఈ, సీఏఎంఎస్, రూట్ మొబైల్, ఫైన్ ఆర్గానిక్, పిరమల్ ఎంటర్‌ప్రైజస్, ఆయిల్ ఇండియాలో బుల్లిష్ ధోరణి కన్పిస్తోంది. ఇక జీఎస్పీఎల్, ఎస్ఐఎస్ ఇండియా, జమ్నా ఆటో, గాడ్ఫ్రే ఫిలిప్స్, సన్ ఫార్మా, ఎరిస్ లైఫ్ సైన్సస్ కౌంటర్లలో బేరిష్ ధోరణి కన్పిస్తోంది.