For Money

Business News

TECH VIEW: బుల్లిష్‌ క్యాండిల్

మున్ముందు రివర్సల్‌ ఉంటుందని టెక్నికల్‌ సూచీలు చెబుతున్నాయి. గత శుక్రవారం నిఫ్టి 20 రోజుల సింపుల్‌ మూవింగ్‌ యావరేజ్‌ (SMA)ను దాటి 16350పైన ముగిసింది. డైలీ చార్ట్‌లో బుల్లిష్‌ క్యాండిల్ ఏర్పడింది. అలాగే వీక్లీ చార్ట్‌లలో హ్యామర్‌ క్యాండిల్‌ ఏర్పడింది. అంటే వచ్చేవారం రివర్సల్‌కు ఛాన్స్‌ ఉందన్నమట.
ఇక ఎఫ్‌ అండ్‌ ఓ విభాగంలోచూస్తే.. 16000 వద్ద నిఫ్టికి గట్టి మద్దతు ఉన్నట్లు కన్పిస్తోంది. కాల్ విభాగంలోచూస్తే 17000 స్థాయి వద్ద అత్యధిక ఓపెన్‌ ఇంటరెస్ట్‌ ఉంది. తరవాతి స్థాయిలో 16500 వద్ద అధిక ఓపెన్‌ ఇంటరెస్ట్‌ ఉంది. అంటే ఇవి రెండు రెసిస్టెన్స్‌ జోన్స్‌ అన్నమాట. అదే పుట్ విభాగంలోచూస్తే నిఫ్టికి 16000 పాయింట్ల వద్ద అత్యధిక ఓపెన్‌ ఇంటరెస్ట్‌ ఉంది, ఆ తరవాతతి స్థాయి 16300. అంటే ఈ రెండు స్థాయిలు కూడా నిఫ్టికి మద్దతుగా నిలిచే అవకాశముంది.