For Money

Business News

16100పైన నిఫ్టి.. నిఫ్టి బ్యాంక్‌ సూపర్‌

సింగపూర్ నిఫ్టికన్నా మెరుగ్గా నిఫ్టి 16100 పాయింట్లపై ప్రారంభమైంది. ప్రస్తుతం 16111 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 85 పాయింట్లు పెరిగింది. నిఫ్టి కన్నా నిఫ్టి బ్యాంక్‌ చాలా బలంగా ఉంది. ఒకశాతం లాభంతో నిఫ్టి బ్యాంక్‌ ప్రారంభమైంది. నిఫ్టిలో 44 షేర్లు లాభంలో ఉండగా, నిఫ్టి బ్యాంక్‌లోని 12 షేర్లూ లాభాల్లో ఉన్నాయి. ఫలితాలు బాగుండటంతో కోల్‌ ఇండియా నిఫ్టి టాప్‌ గెయిన్‌గా నిలిచింది. ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండటంతో అపోలో హాస్పిటల్స్‌ నిఫ్టి టాప్‌ లూజర్‌గా నిలిచింది. నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్ క్యాప్‌ సూచీలు కూడా అర శాతంపైగా లాభంతో ఉన్నాయి. దివీస్‌ ల్యాబ్‌ ఇవాళ కూడా నష్టాల్లో ఉంది. ఫలితాల తరవాత కంపెనీ షేర్‌ రూ. 4400 నుంచి రూ. 3500కు పడింది. ఎల్‌ఐసీ ఇవాళ నష్టాల్లో రూ. 818 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ మంత్లి, వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉన్నందున నిఫ్టిలో హెచ్చుతగ్గులు అధికంగా ఉండొచ్చు.