NIFTY TODAY: 16100 కీలకం
మార్కెట్ ఇవాళ గ్రీన్‌లో ప్రారంభం కానుంది.అమెరికా ఫెడ్ మినిట్స్ తరవాత వాల్‌స్ట్రీట్ గ్రీన్‌లో ముగిసింది. ఈ మార్కెట్లకు భిన్నంగా ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ఇవాళ మే నెలవారీ, వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్. కాబట్టి నిఫ్టిలో తీవ్ర హెచ్చుతగ్గులకు అవకాశముంది. నిఫ్టి క్రితం ముగింపు 16,025. సింగపూర్ నిఫ్టి 60 పాయింట్లకు పైగా లాభంతో ఉంది. ఈ లెక్కన నిఫ్టి ఓపెనింగ్‌లోనే 16100 స్థాయిని దాటొచ్చు. ఈ స్థాయిలో నిఫ్టికి తొలి ప్రతిఘటన రానుంది.ఈ స్థాయిని దాటినా వెంటనే మరో ప్రతిఘటన ఉంది. ఒకవేళ నిఫ్టి పడితే 16085 వద్ద నిలబడుతుందో చూడండి. నిఫ్టికి మద్దతు మాత్రం 16000 దిగువన ఉంది. నిఫ్టికి ఇవాళ్టకి ట్రేడింగ్ లెవల్స్…
అప్ బ్రేకౌట్ – 16160
రెండో ప్రతిఘటన – 16125
తొలి ప్రతిఘటన – 16101
నిఫ్టి కీలక స్థాయి – 16085
తొలి మద్దతు – 15961
రెండో మద్దతు – 15927
డౌన్ బ్రేకౌట్ – 15892