For Money

Business News

నిఫ్టి సరే.. మిడ్‌ క్యాప్‌లో లబోదిబో

ఉదయం లాభాల్లో ప్రారంభమైన నిఫ్టి 16,223ని తారినా, మిడ్‌ సెషన్‌కల్లా పీకలోతు నష్టాల్లోకి జారుకుంది. ఇపుడు 16022 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అంటే 200 పాయింట్లు నష్టపోయింది. యూరో మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా… నిఫ్టిలో నష్టాలు పెరగడం విశేషం. నిజానికి నిఫ్టీ షేర్లలో కన్పిస్తున్న నష్టాలు చాలా తక్కువ. ఇతర షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ముఖ్యంగా నిఫ్టి మిడ్‌ క్యాప్‌ షేర్ల ధరలు ఐస్‌ ముక్కలా కరిగిపోతున్నాయి. నిఫ్టి నెక్ట్స్‌ షేర్లలోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. నిఫ్టి మిడ్‌క్యాప్‌ షేర్ల సూచీ 2.5 శాతం క్షీణించగా, నిఫ్టి నెక్ట్స్‌ షేర్ల సూచీ 1.86 శాతం తగ్గింది. యూరో మార్కెట్ల లాభాలు కూడా నామమాత్రమే. మరి యూరో మార్కెట్లు నష్టాల్లోకి జారకుంటే నిఫ్టి 16000 దిగువకు వెళుతుందా అన్నది చూడాలి. రేపు మంత్లీ, వారంపు డెరివేటివ్‌ కాంట్రాక్ట్స్‌ ముగింపు ఉంది.