మళ్ళీ 16,200 పైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. 16196 వద్ద ఓపెనైన నిఫ్టి 16216ని తాకింది. ఇపుడు 16199 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 74 పాయింట్ల లాభంతో నిఫ్టి ట్రేడవుతోంది. నిఫ్టి అర శాతం, నిఫ్టి బ్యాంక్ ఒక శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. అయితే నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి మిడ్ క్యాప్ షేర్లలో పెద్ద యాక్షన్ లేదు. ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఇవాళ బీమా రంగానికి చెందిన షేర్లు గ్రీన్లో ఉన్నాయి. ఎల్ఐసీ రూ.7 లాభంతో రూ. 829 వద్ద ట్రేడవుతోంది. మొన్న, నిన్న భారీగా క్షీణించిన దివీస్ ల్యాబ్ ఇవాళ స్వల్ప లాభంతో రూ. 3697 వద్ద ట్రేడవుతోంది. ఎంపిక చేసిన కొన్ని షేర్లు మినహా.. మిగిలిన షేర్లలో పెద్ద మార్పు లేదు. ఐటీ సూచీ గరిష్ఠ స్థాయి నుంచి 30 శాతం క్షీణించింది. అయినా ఎక్కడా మద్దతు కన్పించడం లేదు. నాస్డాక్కు మన ఐటీ షేర్లు తీవ్రంగా స్పందిస్తున్నాయి.