NIFTY TODAY: పడితే కొనొచ్చా..?
అమెరికా మార్కెట్ బలహీనంగా ఉన్నా మన మార్కెట్లు స్థిరంగా ఉన్నాయనే చెప్పాలి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నందున మన మార్కెట్లు కూడా గ్రీన్‌లోనే ప్రారంభం కావొచ్చు. రేపు మే నెల మంత్లి, వీక్లీ డెరివేటివ్స్ కాంట్రాక్ట్‌లు క్లోజ్ కానున్నాయి. టెక్నికల్‌గా చూస్తే నిఫ్టి ఓవర్ సోల్డ్ జోన్లో ఉంది. 16000, 16100 వద్ద పుట్ రైటింగ్ చాలా జోరుగా ఉంది. అంటే ఈ స్థాయిల్లో నిఫ్టికి మద్దతు లభించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. నిఫ్టి పడితే కొనుగోలు చేయడం మంచిదని టెక్నికల్ అనలిస్టులు అంటున్నారు. నిఫ్టికి ఇవాళ్టికి లెవల్స్…
అప్ బ్రేకౌట్ : 16242
రెండో ప్రతిఘటన : 16212
తొలి ప్రతిఘటన : 16192
నిఫ్టి కీలక స్థాయి : 16156
తొలి మద్దతు : 16059
రెండో మద్దతు : 16039
డౌన్ బ్రేకౌట్ : 16008