For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు నిస్తేజంగా ఉండటంతో మన మార్కెట్లు కూడా స్థిరంగా లేదా స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. నిన్న యూరో మార్కెట్లు అర శాతంపైగా లాభంతో ముగిశాయి. కాని అమెరికా మార్కెట్లు వరుసగా రెండో రోజు ఎలాంటి లాభాలు లేకుండా ముగిశాయి. దాదాపు పూర్తిగా స్థిరంగా ముగిశాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. జపాన్‌, ఆస్ట్రేలియా, తైవాన్‌ మార్కెట్లు మాత్రమే అరశాతం లాభంతో ఉన్నాయి.చైనా, హాంగ్‌సెంగ్‌ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. సింగపూర్‌ నిఫ్టి ప్రస్తుతం స్థిరంగా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే కేవలం 14 పాయింట్ల లాభంతో ఉంది. సో… మన మార్కెట్లు కూడా స్థిరంగా లేదా నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది.