For Money

Business News

ప్లాస్టిక్‌, స్టీల్, సిమెంట్‌ రంగాలకు ఊరట

ప్లాస్టిక్‌ వస్తువుల తయారీ కోసం ఉపయోగించే ముడిపదార్థాలు, ఇంటర్మిడియటరీస్‌పై కస్టమ్స్‌ సుంకాన్ని కేంద్రం తగ్గించింది. ఈ వస్తువుల దిగుమతి అధికంగా ఉన్నందున వీటిపై సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. అలాగే ఇనుము, స్టీల్‌ ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలు దిగుమతి చేసుకునే ముడి పదార్థాలు, ఇంటర్మిడియటరీస్‌పై కస్టమ్స్‌ సుంకాన్ని కూడా సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. అలాగే కొన్ని రకాల స్టీల్‌ ముడిపదార్థాలపై కూడా ఇదే తరహా తగ్గింపు చేసింది. కొన్ని స్టీల్‌ ఉత్పత్తులపై ఎగుమతి సుంకం విధిస్తున్నట్లు పేర్కొంది. అలాగే సిమెంట్‌ రంగానికి కూడా కొన్ని రాయితీలు ప్రకటించనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మరో గంటలో వెల్లడించనున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది.