For Money

Business News

రాత్రికి రాత్రి 500 మంది కోటీశ్వరులు అయ్యారు

తమ కంపెనీ షేర్‌ విలువ పెరుగుతోందని తెలుసు… మరీ ఇంతగా రాకెట్‌ స్పీడుతో వెళుతుందని మాత్రం ఫ్రెష్‌వర్క్స్ కంపెనీ ఉద్యోగులే భావించలేదు. ఇద్దరు జోహో కార్ప్‌లో పనిచేసిన ఇద్దరు ఉద్యోగులు 2010లో సొంతంగా కంపెనీ పెట్టారు. 2018 వరకు ఆ కంపెనీ ఒక మోస్తరుగా ఉండేది. ఆ ఏడాది విదేశీ కంపెనీలు పెట్టడంతో వ్యాల్యూయేషన్‌ పెరుగుతూ వచ్చింది. కేవలం మూడే మూడేళ్ళలో తమ కంపెనీ నాస్‌డాక్‌లో లిస్టవుతుందని వారు భావించలేదు. కేవలం పదేళ్ళలో భారీగా విస్తరించిన ఈ కంపెనీలో 4,300 మంది పని చేస్తున్నారు. వీరిలో చాలా మంది ఉద్యోగులకు కంపెనీ షేర్లు ఉన్నాయి. నిన్న రాత్రి ఫ్రెష్‌వర్క్స్‌ ఉద్యోగులు లక్షాధికారుల అయ్యారు. కారణం వారి కంపెనీ నాస్‌డాక్‌లో లిస్ట్‌ కావడమే. తమ కంపెనీ షేర్ల విలువ 1,200 కోట్ల డాలర్లకు చేరడం. అంటే దాదాపు రూ. 90,000 కోట్లకుపైనే. నాస్‌డాక్‌కు 13,500 కి.మీ. దూరంలో చెన్నై శివారులోని ఆ కంపెనీ ఆఫీసులో నిన్నంతా పండుగ వాతావరణమే. తమ బాస్‌ నాస్‌డాక్‌లో కంపెనీ షేర్‌ లిస్టింగ్‌ గంట కొట్టడం చూసేందుకు ఆఫీసులో భారీ స్క్రీన్స్‌ ఏర్పాటు చేశారు. ఆఫీసంతా రంగు రంగుల దీపాలు.. డెకరేషన్‌. కంపెనీ లిస్ట్‌ కావడంతో ఫ్రెష్‌వర్క్స్‌లో పనిచేసే 500 మంది ఉద్యోగులు కోటీశ్వరులు అయ్యారు. వీరిలో 70 మంది ఉద్యోగుల వయసు 30 ఏళ్ళకు లోపే.