టాప్‌గేర్‌లో మారుతీ ఫలితాలు
మారుతీ సుజుకీ ఇండియా మార్చి త్రైమాసికంలో రూ.2,671 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. కంపెనీ చరిత్రలోనే అత్యధిక త్రైమాసిక లాభమిది. 2021-22 ఇదే కాల లాభం రూ.1,876 కోట్లతో పోలిస్తే నికర లాభం 42 శాతం పెరిగింది. అధిక అమ్మకాలు, డాలర్ బలం కారణంగా లాభం పెరిగింది. నికర ఆదాయం రూ.26,749 కోట్ల నుంచి రూ.32,060 కోట్లకు పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ.90 అంటే 1800% డివిడెండును కంపెనీ ప్రకటించింది.ఈ స్థాయి డివిడెండ్ ఇవ్వడం కంపెనీ చరిత్రలో ఇదే మొదటిసారి.ఈ త్రైమాసికంలో 5,14,927 వాహనాలను కంపెనీగా దేశీయ మార్కెట్లో 4,50,208 వాహనాలను కంపెనీ అమ్మింది. వాహనాల ఎగుమతులు 68,454 నుంచి 64,719 వాహనాలకు తగ్గినట్లు కంపెనీ వెల్లడించింది.