For Money

Business News

NIFTY TODAY: 16500 కీలకం

శుక్రవారం మార్కెట్‌లో వచ్చిన రివర్సల్‌ చూసి ఇన్వెస్టర్లు తెగ సంబరపడిపోయారు. కాని సోమవారంకల్లా మార్కెట్‌ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. శుక్రవారం భారీ లాభాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు ఇవాళ రివర్స్‌లో ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ భారీ నష్టాల్లో ఉన్నాయి. అంటే దాదాపు ఆ ఉత్సాహం పోయినట్లే. ఇపుడు అమెరికా మార్కెట్లు ప్రారంభమయ్యే వరకు ఫ్యూచర్స్‌ ఇలాగే ఉంటాయా? ఉక్రెయిన్‌, రష్యా మధ్య ప్రారంభమయ్యే చర్చల ఫలితాలు ఎంటాయి? ఇవన్నీ మన మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.దీంతో ఇప్పటికే లాంగ్ పొజిషన్స్‌ ఉన్న ఇన్వెస్టర్లు 16500 స్టాప్‌లాస్‌తో కొనసాగించవచ్చని అనలిస్టులు సూచిస్తున్నారు. నిఫ్టి 17000 మార్కెట్‌ దాటే వరకు బలహీనంగా ఉంటుదని టెక్నికల్స్ చెబుతున్నాయి. మరి మార్కెట్‌ పడితే కొనుగోలు చేయొచ్చా అన్న అంశంపై కూడా క్లారిటీ లేదు. దీంతో చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్‌కు దూరంగా ఉండటమే బెటర్‌ అని అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. నిఫ్టి పడితే దాదాపు వంద పాయింట్ల సమీపంలో మద్దతు లేదు. అంటే 16550 వరకు మద్దతు లేదన్నమాట. అక్కడి నుంచి మరి నిఫ్టి కోలుకుంటుందా లేదా అన్నది చూడాలి. నిఫ్టిలో ట్రేడ్‌ చేయడం కంటే ఫండమెంటల్స్‌ పరంగా బలంగా ఉండి… ఇటీవల 40 నుంచి 50 శాతం పడిన షేర్లలో ట్రేడ్‌ చేయడం బెటర్‌ అని అనలిస్టులు చెబుతున్నారు.

అప్‌ బ్రేకౌట్‌ 16736
రెండో ప్రతిఘటన 16630
తొలి ప్రతిఘటన 16594
నిఫ్టికి కీలక స్థాయి 16550
తొలి మద్దతు 16483
రెండో మద్దతు 16434
డౌన్‌ బ్రేకౌట్‌ 16370