For Money

Business News

15,900పైన ప్రారంభమైన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టికి అనుగుణంగా నిఫ్టి 15,900పైన ప్రారంభమైంది. టెక్నికల్‌ అనలిస్టుల అంచనా ప్రకారం నిఫ్టికి ఇదే స్థాయిలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. 15,915ని తాకిన నిఫ్టి ఇపుడు 15,884 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 24 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టి తొలి మద్దతు స్థాయి 15,850ని తాకుతుందేమో చూడాలి. అంటే నిఫ్టి నష్టాల్లోకి చేరుతుందన్నమాట. నిఫ్టి అధిక స్థాయిలో అమ్మి… ఒక మోస్తరు లాభాలకే లాభాలు స్వీకరించండి. ఎందుకంటే దిగువస్థాయిల్లో నిఫ్టికి మద్దతు లభిస్తోంది. ఇవాళ కూడా బ్యాంక్‌ నిఫ్టి నుంచి మద్దతు లభిస్తోంది. అధిక క్రూడ్‌ ధరలు కారణంగా ఓఎన్‌జీసీ లాభాల్లో ఉంది. డెల్టా వేవ్‌ ఇపుడు మార్కెట్లను భయపెట్టిస్తోంది. అందుకే మళ్ళీ ఫార్మా కంపెనీలపై ఆసక్తి పెరుగుతోంది.
నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఓఎన్‌జీసీ 123.35 2.03
సిప్లా 968.00 1.14
ఏషియన్‌ పెయింట్స్‌ 3,034.30 1.01
దివీస్‌ ల్యాబ్‌ 4,284.00 0.83
గ్రాసిం 1,518.40

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 717.20 -1.21
కోల్‌ ఇండియా 147.55 -0.81
మారుతీ 7,601.90 -0.62
టీసీఎస్‌ 3,361.70 -0.56
ఎల్‌ అండ్‌ టీ 1,515.90 -0.52