జీ షేర్లలో ఇన్‌సైడర్ ట్రేడింగ్
జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందిన స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) తేల్చింది. ఈ లావాదేవీలు జరిపిన 15 కంపెనీలు/ వ్యక్తులను స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ జరగకుండా నిషేధించింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ వల్ల ఈ కంపెనీలు రూ.23.84 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు సెబీ తేల్చింది.2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలు ప్రకటించడానికి ముందు అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు సెబీ గుర్తించింది. 2020 ఆగస్టు 18న ట్రేడింగ్ పూర్తయిన తరవాత కంపెనీ ఫలితాలను ప్రకటించింది. 19వ తేదీన ఈ కంపెనీ షేర్ 13 శాతంపైగా పెరిగింది. ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న సంబంధిత కంపెనీలు ఫలితాల ప్రకటనకు ముందు పొజిషన్స్ తీసుకున్నట్లు సెబీ గుర్తించింది. ఫలితాలకు ముందు కొని, ఆ తరవాత వెంటనే షేర్లను అమ్మినట్లు గుర్తించింది.
ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన కంపెనీలు/వ్యక్తులు…
1.బిజాల్ షా
2. గోపాల్ రిటోలియా
3. జతిన్ చావ్లా
4. అమిత్ భన్వర్‌లాల్ జాజూ
5. మనీష్ కుమార్ జాజూ
6. గోమతి దేవి రిటోలియా
7. దల్జిత్ గురుచరణ్ చావ్లా
8 మోనికా లఖోటియా
9 పుష్పాదేవి జాజూ
10 భవార్‌లాల్ రాంనివాస్ జాజూ
11 భవార్‌లాల్ జాజూ HUF
12 రితేష్ కుమార్ కమల్‌కిషోర్ జాజూ 13 సక్సెస్‌ష్యూర్ పార్ట్‌నర్స్
14 యాష్ అనిల్ జాజూ
15 విమల సోమాని