For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు ఆశాజనకంగా ఉన్నా… భారీ లాభాలు ఎక్కడా కన్పించడం లేదు. రాత్రి అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిశాయి. నాస్‌డాక్‌ 0.6 శాతం లాభంతో ముగిసింది. మిగిలిన సూచీలు నామ మాత్రపు లాభాలతో ముగిశాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో చైనా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్‌లో మార్పు లేదు. జపాన్‌ నిక్కీ, న్యూజిల్యాండ్‌ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. సింగపూర్‌ నిఫ్టి కూడా స్థిరంగా క్రితం ముగింపు వద్దే ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు స్థిరంగా లేదా స్వల్ప నష్టంతో ప్రారంభం కావొచ్చు. బీపీసీఎల్‌ ఇవాళ స్టార్ షేర్‌గా ఉండొచ్చు.