For Money

Business News

లాభాలతో ప్రారంభం కానున్న నిఫ్టి

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయాలకు ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా స్పందించాయి. యూరో మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. అలాగే అమెరికా మార్కెట్లు కూడా. రాత్రి నాస్‌డాక్‌ భారీ లాభాలతో ట్రేడయినా.. 0.87 శాతం లాభంతో ముగిసింది. అయితే డౌజోన్స్‌ 0.6 శాతం నష్టపోగా, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ స్థిరంగా ఉంది. నిన్న భారీగా క్షీణించిన జపాన్‌ నిక్కీ ఇవాళ లాభాలతో ట్రేడవుతోంది. చాలా మార్కెట్లు అర శాతం వరకు లాభాలతో ట్రేడవుతున్నాయి. చైనా మాత్రం నష్టాల్లో ఉంది. హాంగ్‌సెంగ్‌ 0.75 శాతం లాభంతో ట్రేడవుతోంది. సింగపూర్‌ నిఫ్టి కూడా 67 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. సో… నిఫ్టి కూడా ఒక మోస్తరు లాభాలతో ప్రారంభం కానుంది. రాత్రి డాలర్‌ భారీగా లాభపడింది. దీంతో బులియన్‌ 5 శాతంపైగా క్షీణించింది. ఉదయం నుంచి లాభాల్లోకి వచ్చింది. క్రూడ్‌ కూడా క్షీణించినా… డాలర్‌ బలపడటంతో భారత్‌ వంటి దేశాలకు దీనివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు.