For Money

Business News

కోలుకున్నా…నిఫ్టి నిలబడేనా?

సింగపూర్ నిఫ్టి బాటలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో వంద పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైన నిఫ్టికి 15,650 ప్రాంతంలో మద్దతు అందింది. ప్రస్తుతం 85 పాయింట్ల నష్టంతో 15,681 వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. బ్యాంక్‌ నిఫ్టి, మిడ్‌ క్యాప్ షేర్ల సూచీలు కూడా ఒక శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టిలో ఏకంగా 40 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. డే ట్రేడర్స్‌ నిఫ్టి ఇక్కడి నుంచి ఏ మాత్రం పెరిగినా.. అంటే 15,700 ప్రాంతానికి వస్తే అమ్మడానికి ప్రయత్నం చేయొచ్చు. స్టాప్‌ లాస్‌ 15,720. ఆ స్థాయిని దాటితే ట్రేడ్‌ చేయకపోవడమే బెటర్‌. ఇది డే ట్రేడింగ్‌ కోసం. పొజిషనల్‌ ట్రేడర్స్‌ మాత్రం నిఫ్టి ఏమాత్రం పెరిగినా అమ్మవచ్చని టెక్నికల్‌ అనలిస్టులు సలహా ఇస్తున్నారు. 15,680 దిగువకు వెళితే లాంగ్‌పొజిషన్స్‌ నుంచి బయటపడటం మంచిది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
యూపీఎల్‌ 843.65 0.65
ఏషియన్‌ పెయింట్స్‌ 3,028.40 0.32
అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 6,604.15 0.25
హెచ్‌సీఎల్‌ టెక్‌ 981.45 0.21
నెస్లే ఇండియా 17,999.25 0.19

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
అదానీ పోర్ట్స్‌ 681.90 -3.51
హిందాల్కో 373.80 -1.70
హీరో మోటోకార్ప్‌ 2,935.10 -1.35
యాక్సిస్‌ బ్యాంక్‌ 741.05 -1.17
బజాజ్‌ ఫైనాన్స్‌ 6,012.90 -1.13