For Money

Business News

దిగువ స్థాయిలో నిఫ్టికి మద్దతు?

నిఫ్టి ఇవాళ నష్టాలతో ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 15,767. సింగపూర్‌ నిఫ్టి ధోరణి చూస్తుంటే నిఫ్టి 15,670 ప్రాంతంలో ప్రారంభమయ్యే అవకాశముంది. అమెరికా ఫెడ్‌ నిర్ణయానికి భారత మార్కెట్లు తీవ్రంగా స్పందిస్తాయా అన్నది అనుమానంగానే ఉంది. నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు అందే అవకాశముంది. కాబట్టి ఓపెనింగ్‌లో నిఫ్టిని కొనుగోలు చేయొచ్చు. కాని స్టాప్‌లాస్‌ 15,650. ఈ స్థాయి దిగువకు వస్తే మాత్రం నిఫ్టిలో భారీ ఒత్తిడి ఖాయం. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉంది, అలాగే నిఫ్టి ఓవర్‌బాట్‌ పొజిషన్‌లో ఉంది. కాబట్టి, దిగువ స్థాయిలో కొనేవారు కచ్చితంగా స్టాప్‌లాస్‌ పాటించండి. నిఫ్టి దిగువ స్థాయిలో మద్దతు అందే పక్షంలో క్రితం ముగింపు స్థాయికి చేరే అవకాశముంది. కాని కాస్త దిగువనే లాభాలు స్వీకరించడం మంచిది. అధిక స్థాయిలో కొనుగోలు మాత్రం చేయొద్దు. ఓపెనింగ్‌లో నిఫ్టి భారీగా క్షీణిస్తే మాత్రం కచ్చితంగా కొనుగోలు చేయొచ్చు. అయితే ఒక మోస్తరు లాభాలకు బయటపడండి.

ఇది కేవలం ఇంట్రాడే కోసమే. పొజిషనల్‌ ట్రేడర్స్‌కు కాదు. ఎందుకంటే మార్కెట్‌ ఇక్కడి నుంచి మార్కెట్‌ కరెక్షన్‌ జోన్‌లోకి వెళ్ళొచ్చు.