For Money

Business News

జొమాటొ ఫలితాలు… ప్చ్‌

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జొమాటొ కంపెనీ రూ. 176 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 389 శాతం పెరిగినట్లు కన్పిస్తోంది. కాని జూన్‌తో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే కన్సాలిడేటెడ్‌ నికర లాభం 30 శాతంపైగా తగ్గింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 253 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. పైగా ఈ త్రైమాసికానికి కంపెనీ కనీసం రూ.260 కోట్ల నికర లాభాన్ని ప్రకటిస్తుందని ఈటీ నౌ ఛానల్‌ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న అనలిస్టులు అంచనా వేశారు. ఈ అంచనాలను కంపెనీ ఏ మాత్రం అందుకోలేకపోయింది. కంపెనీ కన్సాలిడేటెడ్‌ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే ఈ త్రైమాసికంలో 64 శాతం పెరిగి రూ. 3060 కోట్ల నుంచి రూ. 5020 కోట్లకు చేరింది. గ్రాస్‌ ఆర్డర్‌ వ్యాల్యూ 55 శాతం పెరిగి రూ.17,670 కోట్లని జొమాటొ తెలిపింది. బ్లింకిట్‌ ఆదాయం కూడా 129 శాతం పెరిగి రూ. 1156 కోట్లకు చేరింది. పేటీఎం నుంచి టికెటింగ్‌ బిజినెస్‌ కొనుగోలు చేసినందున కంపెనీ వద్ద క్యాష్‌ బ్యాలెన్స్‌ రూ. 2014 కోట్ల నుంచి రూ. 1728 కోట్లకు తగ్గింది. మరో రూ. 8500 కోట్లను సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి సమీకరించాలని కంపెనీ ప్రతిపాదించింది. కంపెనీని మరింత ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు నిధులను సమీకరించాలని నిర్ణయించినట్లు జొమాటొ పేర్కొంది.

Leave a Reply