భారీగా పెరిగిన జొమాటో నష్టం
ఇటీవల క్యాపిటల్ మార్కెట్లో ప్రవేశించిన జొమాట ఇవాళ చాలా నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 356.2 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర నష్టం రూ. 99.8 కోట్లు మాత్రమే. కంపెనీ అమ్మకాలు మాత్రం 26 శాతం పెరిగి రూ. 1,160 కోట్లకు చేరాయి. కంపెనీ షేర్ ఎన్ఎస్ఈలో ఇవాళ 4.3 శాతం నష్టంతో రూ. 125 వద్ద ముగిసింది.