జొమాటో: నోరూరించే ఫలితాలు
డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జొమాటొ కంపెనీ నష్టాలు భారీగా తగ్గాయి. 2020 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 352 కోట్ల నికరలాభం ఆర్జించిన… ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో రూ. 67 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇదే సమయంలో కంపెనీ ఆదాయం 82 శాతం పెరిగి రూ. 609 కోట్ల నుంచి రూ.1112 కోట్లకు చేరింది. సెప్టెంబర్ నెలతో ముగిసిన రెండో త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ ఆదాయం 9 శాతం పెరిగినట్లు జొమాటో వెల్లడిచింది. కస్టమర్ డెలివరీ చార్జీలు 22 శాతం తగ్గినట్లు పేర్కొంది. దీనికి కారణంగా కస్టమర్ డెలివరీ చార్జీలను ఆర్డర్‌కు రూ.7.5 తగ్గించినట్లు జొమాటొ పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే గ్రాస్ ఆర్డర్ వ్యాల్యూ 84.5 శాతం పెరిగి రూ. 5500 కోట్లకు చేరిందని కంపెనీ వెల్లడించింది. ఆర్డర్ వ్యాల్యూ భారీగా పెరగడానికి కారణం డెలివరీ చార్జీలు తగ్గించడమేనని తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే కంపెనీకి అందిన ఆర్డర్ల సంఖ్య కూడా 93 శాతం పెరిగినట్లు వెల్లడించింది.