జొమాటో లిమిటెడ్ ఇక ఎటర్నల్

పుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమోటో లిమిటెడ్ తన పేరును మార్చుకుంది. కంపెనీ పేరును ఎటర్నల్ లిమిటెడ్‌గా మార్చినట్లు జొమాటొ ఇవాళ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. అలాగే కంపెనీ లోగోను కూడా మార్చినట్లు తెలిపింది. అయితే ఇది కేవలం కంపెనీ పేరు మాత్రమేనని… తమ బ్రాండ్‌లో ఎలాంటి మార్పు ఉండదని కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ వెల్లడించారు. అంటే మార్కెట్‌లో జొమాటొ పేరు, లొగోలలో ఎలాంటి మార్పు ఉండదన్నమాట. బ్లింకిట్ కంపెనీని టేకోర్ చేసినప్పటి నుంచి జొమాటాను తాము అంతర్గతంగా ఎటర్నల్‌గా వ్యవహరించినట్లు దీపిందర్ తన లేఖలో పేర్కొన్నారు. కేవలం కంపెనీ పేరును మాత్రమే మార్చామని… ఈ మేరకు కంపెనీ బోర్డు కూడా ఆమోదం తెలిపినట్లు దీపిందర్ వెల్లడించారు.