జీరోదా ఏటీఓ వచ్చేసింది
ఇన్వెస్టర్లను చాలా కాలం నుంచి ఊరిస్తున్న బ్రోకరేజి సంస్థ ఏటీఓను ఇవాళ ప్రవేశ పెట్టింది. అలర్ట్ ట్రిగర్స్ ఎన్ ఆర్డర్ (Altert Triggers an Order-ATO)ను ప్రవేశపెట్టినట్లు సంస్థ ఈసీఓ నితిన్ కామత్ ఇవాళ ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు ఇన్వెస్టర్లకు ట్రేడింగ్ సమయంలో అలర్ట్స్‌ను మాత్రం అందించే వ్యవస్థ ఉండేది. ఇపుడు షరతులు పెడితే… అవి ఓకే అయిన వెంటనే ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అయ్యే సౌకర్యం ఏటీఓతో వీలవుతుంది. అంటే ఇన్వెస్టర్లు ఫలానా కండీషన్స్ పూర్తయితే ఫలానా ట్రేడ్ చేయమంటే… దాన్నిఏటీఓ పూర్తి చేస్తుంది. ఉదాహరణకు నిఫ్టి 25000 స్థాయిని దాటితే రిలయన్స్ షేర్‌ను కొనుగోలు చేయమని మీరు షరతు పెడితే… నిఫ్టి ఆ స్థాయి దాటినే వెంటనే ఆర్డర్ పెట్టి ఎగ్జిక్యూట్ కూడా చేస్తుంది. అలాగే నిఫ్టి గనుక 24975ని తాకితే ఫలానా స్ట్రాడల్‌ను షార్ట్ చేయమంటే… చేస్తుంది. స్ట్రాడల్ అంటే ఒకే స్ట్రయిక్ వద్ద ఆప్షన్‌ను కొనుగోలు చేయడం, అమ్మడం. ఈ కండీషన్ష్ అన్నీ మనం ముందు సిస్టమ్‌లో పెట్టాల్సి ఉంటుంది. ఆ తరవాత మనం ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ను చూడకపోయినా… మనం పెట్టిన కండీషన్స్ పూర్తయిన వెంటనే ఆర్డర్ అయిపోతుంది.ప్రస్తుతం ఈ సౌకర్యాన్ని కేవలం డెస్క్‌టాప్ మోడల్‌లో మాత్రమే పనిచేస్తుందని, త్వరలోనే తమ మొబైల్ యాప్ కైట్‌లో కూడా దీన్ని ప్రవేశ పెడతామని జీరోద ప్రకటించింది.