For Money

Business News

10 శాతం పెరిగిన ఎస్‌ బ్యాంక్‌

ఇపుడు బ్యాంకింగ్‌ రంగంలో ఎస్‌ బ్యాంక్‌ షేర్‌ క్రమంగా బలపడుతూ వస్తోంది. గత కొన్ని రోజుల నుంచి ఈ బ్యాంక్‌ నుంచి చాలా పాజిటివ్‌ న్యూస్‌ వస్తోంది. అలాగే వచ్చే ఏడాదికి ఈ బ్యాంకు షేర్లపై ఉన్న లాకిన్‌ పీరియడ్‌ కూడా పూర్తి కానుంది. ఇవాళ ఉదయం ఈ షేర్‌లో భారీ ఎత్తున బ్లాక్‌ డీల్స్‌ జరిగాయి. దీంతో ఈ షేర్‌ ఇవాళ పది శాతంపైగా పెరిగి రూ. 19.55 వద్ద ఈ షేర్‌ ట్రేడవుతోంది. 2.21 కోట్ల షేర్లకు బ్లాక్‌ డీల్‌ జరిగింది. ఇంకా బ్లాక్‌ డీల్స్‌కు సంబంధించిన సమాచారం వస్తోంది. రూ. 18.10 నుంచి ఈ బ్లాక్‌ డీల్‌ జరిగింది. ఇప్పటికే ఎన్‌ఎస్‌ఈలో 23.73 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి.