For Money

Business News

పేటీఎం బైబ్యాక్‌ ఎలా ఉండబోతోంది?

ఈనెల 13వ తేదీన పేటీఎం బోర్డు సమావేశం కానుంది. ఈ బోర్డు సమావేశంలో షేర్ల బైబ్యాక్‌ గురించి చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది బోర్డు. షేర్ల బైబ్యాక్‌కు సరేనంటే… ఏ ధరకు … ఏ మేరకు కొనుగోలు చేస్తారో కూడా బోర్డు నిర్ణయించిస్తుంది. బైబ్యాక్‌ ప్రతిపాదనతో పేటీఎం షేర్‌ ఇవాళ 5 శాతంపైగా పెరిగింది. కంపెనీ షేర్‌ ధర వరుసగా పతనం అవుతున్నందున ఈ ట్రెండ్‌ను ఆపేందుకు కంపెనీ ఈ ప్రయత్నం చేస్తున్నట్లు కన్పిస్తోంది. పేటీఎం కంపెనీ ఏ మేరకు బైబ్యాక్‌ చేస్తారనే అంశంపై మూడు ప్రతిపాదనలు చర్చకు వస్తున్నాయి. తాజా అకౌంట్స్‌ ప్రకారం పేటీఎం నెట్‌వర్త్‌ రూ. 13,564 కోట్లు. ఇందులో ఇందులో రూ. 9,182 కోట్ల నగదు ఉంది. ఒకవేళ నెట్‌వర్త్‌లో 25 శాతానికి సమానమైన మొత్తానికి షేర్లు బైబ్యాక్‌ చేయాలని భావిస్తే.. కంపెనీ రూ. రూ. 3,391 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ చేస్తుంది. దీనికి సెబీతో పాటు వాటాదారుల అనుమతి అవసరం. అదే 15 శాతమైతే రూ. 2,035 కోట్లకు బై బ్యాక్‌ చేయొచ్చు. దీనికి కేవలం వాటాదారుల అనుమతి చాలు. అదే
10 శాతం మొత్తానికి అంటే రూ.1,350 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ చేయాలంటే మాత్రం ఎవరి అనుమతి అక్కర్లేదు. కేవలం బోర్డు ఆమోదంతోనే షేర్ల బైబ్యాక్‌ చేయొచ్చు. ఇది చాలా ఈజీ పద్ధతి. మరి ఏ పద్ధతిలో.. ఎంత మొత్తానికి బైబ్యాక్‌ చేస్తారో 13న తెలుస్తుంది. ప్రస్తుతం షేర్‌ మాత్రం దాదాపు 6 శాతంపైగా లాభంతో రూ.541.50 వద్ద ట్రేడవుతోంది.