For Money

Business News

ఆరుకు చేరిన వైరస్‌ కేసులు

దేశంలో ఆరు హ్యుమన్‌ మెటాన్యూమో వైరస్‌ (HMPV) కేసులు బయటపడినట్లు వార్తలు వస్తున్నాయి. బెంగళూరులో ఇవాళ రెండు ఈ వైరస్‌ కేసులు నమోదు అయినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. తరవాత అహ్మదాబాద్‌లో ఒక హెచ్‌ఎంపీవీ కేసు నమోదు అయినట్లు మధ్యహ్నం గుజరాత్‌ వైద్య అధికారులు వెల్లడించారు. ఇక సాయంత్రం కోల్‌కతా నుంచి కూడా వైరస్‌కు సంబంధించి వార్తలు వచ్చాయి. తమ నగరంలో మూడు వైరస్‌ కేసులు నమోదు అయినట్లు పీర్‌లెస్‌ హాస్పిటల్‌ సీఈఓ సుదీప్తా మిత్రో వెల్లడించారు. ఈ వైరస్‌ కేసులు నమోదు కావడం కొత్త కాదని, ప్రతి ఏడాది శీతాకాలంలో ఈ వైరస్‌ కేసులు నమోదు అవుతాయని ఆయన వెల్లడించారు. కాబట్టి జనం ముందుజాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.