For Money

Business News

వోల్వో నుంచి XC40 రీఛార్జ్‌

దేశంలో తమ తొలి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ XC40 రీఛార్జ్‌ను మార్కెట్‌లోకి విడుదల విడుదల చేసింది. ఈ కారు ధర రూ.55.9 లక్షలు (ఎక్స్ – షోరూమ్) బెంగళూరు ప్లాంట్‌లో దీన్ని అసెంబుల్ చేస్తున్న కంపెనీ తెలిపింది. ఒకసారి ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. వోల్వో కార్ ఇండియా వెబ్‌సైట్‌లో ఈ నెల 27 నుంచి రూ.50,000 ముందస్తుగా చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఆన్‌లైన్‌ బుకింగ్ ద్వారా మాత్రమే వీటిని విక్రయిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.