ప్రపంచంలో టాప్ బ్రాండ్స్ …టీసీఎస్@ 2
ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ సేవల బ్రాండ్లలో టాటా కన్సల్టెన్సీ సర్వీసె్‌స (టీసీఎస్) రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాది మూడో స్థానంలో నిలిచిన టీసీఎస్ ఈసారి రెండో స్థానానికి చేరింది. ఇక ఈ ఏడాది జాబితాలో జం ఇన్ఫోసిస్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. మరో నాలుగు భారత ఐటీ కంపెనీలకు టాప్-25లో స్థానం లభించింది. విప్రో 7, హెచ్‌సీఎల్ 8, టెక్ మహీంద్రా 15, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ 22వ స్థానంలో నిలిచాయి. ఏటా బ్రాండ్ల విలువను అంచనా వేసే బ్రాండ్ ఫైనాన్స్ తాజా నివేదికను ‘ఐటీ సర్వీసెస్ 25’ పేరుతో విడుదల చేసింది. ప్రపంచంలో అత్యంత విలువైన, బలమైన ఐటీ సేవల బ్రాండ్‌గా యాక్సెంచర్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ కంపెనీ బ్రాండ్ విలువ 3,620 కోట్ల డాలర్లు. 2020-22 మధ్యలో భారత ఐటీ బ్రాండ్ల విలువ సగటున 51 శాతం చొప్పున అభివృద్ధి చెందాయి. ఇదే కాలంలో అమెరికన్ ఐటీ బ్రాండ్ల విలువ 7 శాతం తగ్గింది. గడిచిన ఏడాదికాలంలో టీసీఎస్ బ్రాండ్ విలువ 12 శాతం పెరిగి 1,680 కోట్ల డాలర్లకు చేరుకుంది. 2020 నుంచి విలువ 24 శాతం వృద్ధి చెందింది. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఐటీ సేవల బ్రాండ్‌గా ఇన్ఫోసిస్ ఘనత దక్కించుకుంది. గత ఏడాది నుంచి కంపెనీ బ్రాండ్ విలువ 52 శాతం పెరిగి 1,280 కోట్ల డాలర్లకు చేరుకుంది. అలాగే విప్రో బ్రాండ్ విలువ 630 కోట్ల డాలర్లుగా నమోదైంది. ఈ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఐటీ బ్రాండ్‌గా నిలవడం విశేషం.
ప్రపంచ టాప్-500లో భారత బ్రాండ్లు
టాటా 78
ఇన్ఫోసిస్ 158
ఎల్ఐసీ 179
రిలయన్స్ 236
ఎయిర్టెల్ 269
ఎస్బీఐ 279
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 319
విప్రో 350
మహీంద్రా గ్రూప్ 364
హెచ్‌సీఎల్ 369
ఎల్ అండ్ టీ 417
ఇండియన్ ఆయిల్ 448
రిలయన్స్ జియో 451