భారత వృద్ధి రేటులో కోత
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) భారత జీడీపీ వృద్ధి రేటును ప్రపంచ బ్యాంక్ ఒక శాతం తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు కేవలం 6.5 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది. గతంలో భారత జీడీపీ వృద్ధిరేటు 7.5 శాతం ఉంటుందని అంచనా వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మన జీడీపీ వృద్ధి రేటు 8.7 శాతం. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు దిగజారడమే దీనికి కారణమని పేర్కొంది. ప్రపంచ బ్యాంర్, ఐఎంఎఫ్ల వార్షిక సమావేశం ప్రారంభం నేపథ్యంలో ‘సౌత్ ఏషియా ఎకనామిక్ ఫోకస్’ పేరుతో ఒక నివేదికను ప్రపంచ బ్యాంక్ విడుదల చేసింది. ఇతర దేశాలతో పోలిస్త భారత వృద్ధి రేటు భేషుగ్గా ఉందని కితాబు ఇచ్చింది.