For Money

Business News

14వ సారి బోనస్‌

ఈనెల 17వ తేదీన జరిగే బోర్డు సమావేశంలో బోనస్‌ షేర్ల జారీ ప్రతిపాదనపై విప్రో కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకోనుంది. ఈ వార్తతో విప్రో షేర్‌ ఇవాళ 4 శాతంపైగా పెరిగి నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవల చాలా డల్‌గా ఉన్న ఐటీ కౌంటర్లు… ఫలితాల తరవాత వెలుగులో ఉంటున్నాయి. ఐటీ రంగానికి గడ్డుకాలం తొలగనుందని.. ఇక నుంచి ఈ రంగానికి చెందిన షేర్లు రాణిస్తాయని అనలిస్టులు అంటున్నారు. ఈ నేపథ్యంలో విప్రో కంపెనీ తన వాటాదారులకు 14వ సారి బోనస్‌ ఇవ్వనుంది. 2019 తర్వాత కంపెనీ బోనస్‌ షేర్లు తొలిసారి ఇవ్వనుంది. వాస్తవానికి తొలిసారి 1971లో బోనస్‌ షేర్ల జారీకి శ్రీకారం చుట్టంది. ఆ తరవాత 1981, 1985, 1987, 1989, 1992, 1995, 1997, 2004, 2005, 2010, 2017. 2019లో బోనస్‌ షేర్లను జారీ చేసింది. గడచిన 16 ఏళ్ల కాలంలో విప్రో తన వాటాదారులకు మంచి ప్రతిఫలాన్ని అందించింది. 2008 అక్టోబర్ 10న విప్రో షేర్‌ దర రూ.59.28 కాగా ఇవాళ రూ. 550.70. రూ. 59.28 వద్ద ఈ షేర్‌లో లక్ష రూపాయలను పెట్టుబడిగా పెట్టిన ఇన్వెస్టరుకు అద్భుత ఫలితాలు అందించింది విప్రో. ఆ షేర్లను ఇప్పటి వరకు సదరు ఇన్వెస్టర్‌ కొనసాగించి ఉంటే వారి షేర్ల సంఖ్య 1.686 నుంచి ఇపుడు 7,493కి చేరేవి. అంటే ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 7,493 విప్రో షేర్ల విలువ రూ.40 లక్షలు దాటిపోయిందన్నమాట. ఈనెల 17 కంపెనీ బోనస్‌ షేర్ల నిష్పత్తితో పాటు కంపెనీ త్రైమాసిక ఫలితాలను కూడా వెల్లడించనుంది.