For Money

Business News

గ్రీన్‌లో ముగిసేనా?

వాల్‌స్ట్రీట్‌ ప్రస్తుతం నామమాత్రపు నష్టాలతో ట్రేడవుతోంది. అనేక కంపెనీల ఫలితాలు వస్తున్నాయి. మెజారిటీ కంపెనీల ఫలితాలు మార్కెట్‌ అంచనాలను మించాయి. టెస్లా ఫలితాలు ఈ వారం రానున్నాయి. ఈ సీజన్‌ త్వరలోనే ముగియనుంది. మరోవైపు అమెరికా వృద్ధి రేటును పెంచింది ఐఎంఎఫ్‌. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఓపెనింగ్‌లో స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. మరి క్లోజింగ్‌ సమయానికల్లా లాభాల్లోకి వస్తాయా అన్నది చూడాలి. డాలర్‌ స్థిరంగా ఉంది. పెద్దగా మార్పు లేదు. అయితే క్రూడ్‌ ఆయిల్‌ మాత్రం ఇవాళ రెండు శాతం పెరిగింది. ఇక బులియన్‌ పరుగు ఆగడం లేదు. ముఖ్యంగా వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బంగారం కూడా 2756 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 2700 డాలర్ల వద్ద తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న బంగారం.. ఇపుడు ఆ స్థాయిని పటిష్ఠంగా దాటినట్లు కన్పిస్తోంది. 3000 డాలర్లవైపు పరుగులు తీస్తోందని కొందరు అనలిస్టుల అంచనా. ఈక్విటీ అనలిస్టులు బాండ్‌ ఈల్డ్స్‌ నాన్‌ స్టాప్‌గా పెరగడంపై ఆందోళనతో ఉన్నారు. గత కొన్ని రోజులుగా బాండ్‌ ఈల్డ్స్‌ నాలుగు శాతంపైనే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వాల్‌స్ట్రీట్‌ లాభాల్లో ముగుస్తుందా అన్నది చూడాలి.

Leave a Reply