For Money

Business News

వడ్డీ రేట్లపై జీడీపీ నీళ్ళు?

అనూహ్యంగా పెరిగిన జీడీపీ వృద్ధి రేటుతో వడ్డీ రేట్ల తగ్గింపుపై మార్కెట్‌లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 8.2 శాతం వృద్ధి రేటు నమోదు అయిన విషయం తెలిసిందే. ఏకంగా 0.8 శాతం మేర జీడీపీ వృద్ధి రేటు పెరిగింది. ఇది ఆరు త్రైమాసికాల రికార్డు. జీడీపీ వృద్ధి రేటుతో వడ్డీ రేట్ల తగ్గింపుపై మార్కెట్‌లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈసారి వడ్డీ రేట్ల తగ్గింపును ఆర్బీఐ వాయిదా వేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈనెల 3వ తేదీన ప్రారంభమయ్యే ఎంపీసీ సమావేశంలో దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చించనున్నారు. ఈనెల 5వ తేదీన వడ్డీ రేట్లపై ఆర్బీఐ తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. జీడీపీ వృద్ధి రేటు భారీగా పెరగడం, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు కూడా కనిష్ఠ స్థాయిల వద్ద ఉండటంతో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తుందా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో బ్యాంకు షేర్లు, ఎన్‌బీఎఫ్‌సీ షేర్ల విషయంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.