52 వారాల కనిష్ఠ స్థాయి తప్పదా?
మార్కెట్ మూడ్ చూస్తుంటే ఈసారి నిఫ్టి 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకడం ఖాయంగా కన్పిస్తోంది. క్రూడ్ ధరలు తగ్గితే… ఈ స్థాయిని చేరడం కాస్త ఆలస్యం కావొచ్చేమోగాని… చేరడం మాత్రం ఖాయంగా కన్పిస్తోంది. ఐటీ కంపెనీల నుంచి ఈసారి కూడా పెద్దగా మెరుపులు ఉండే ఛాన్స్ లేదు. మెజారిటీ కంపెనీలు ఈసారి నిస్తేజ ఫలితాలు ప్రకటించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అక్టోబర్‌తోపాటు డిసెంబర్‌లో కూడా ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచే ఛాన్స్ ఉందని మార్కెట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నిఫ్టిలో ఇంకా ఒత్తిడికి ఛాన్స్ ఉంది. నిఫ్టి 52 వారాల కనిష్ఠ స్థాయి 22,182 . మరో 600 పాయింట్ల దూరంలో ఉంది. అమెరికా మధ్యంతర ఎన్నికలు జరిగేలోపు ఈ స్థాయికి రావొచ్చేమో చూడాలి. తొందరగా వస్తే… దీపావళి ర్యాలీకి ఛాన్స్ ఉంది. లేదంటే ఈసారి కూడా దీపావళి మెరుపులు ఉండకపోవచ్చు. ఇక ఇవాళ నిఫ్టి స్థిరంగా ప్రారంభం కానుంది. నిఫ్టి మంత్లి డెరివేటివ్స్ క్లోజింగ్ కారణంగా ఇవాళ షార్ట్ కవరింగ్ వస్తుందా అన్నది చూడాలి. మార్నింగ్ సెషన్‌లో నిఫ్టి కోలుకుంటే చివర్లో ఒత్తిడి ఉండొచ్చు. లేదా ఏకంగా క్లోజింగ్‌లోనే ప్రజెర్‌కు ఛాన్స్ ఉంది. విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలను చూస్తుంటే… షార్ట్ కవరింగ్‌లో కూడా పెద్దగా బలం ఉండకపోవచ్చు. కాస్తో కూస్తే న్యూఏజ్ షేర్లు మాత్రమే కాస్త ఈ పతనంలో నిలదొక్కుకుంటున్నాయి. ఎకానమీ షేర్లు, బ్యాంకింగ్ షేర్లలో జాగ్రత్తగా ఉండటం బెటర్. పొజిషనల్ ఇన్వెస్టర్లు… ఇపుడు కొనడం కంటే… మంచి షేర్లను గమనించండి. నిఫ్టి బాటమ్‌ఔట్ అయ్యాకే కొనండి. మరి నిఫ్టి ఎక్కడ బాటమ్ ఔట్ అవుతుందనేది ఇపుడు మార్కెట్‌ను వేధిస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. వెయిట్ అండ్ వాచ్.
