For Money

Business News

నిఫ్టి నిలబడుతుందా?

మిడ్‌ క్యాప్స్‌ ఎంత పడినా.. క్లోజింగ్‌కల్లా కోలుకుంటున్నాయి. నిఫ్టి భారీ నష్టాలు పొందినా… దిగువస్థాయిలో మద్దతు లభిస్తోంది. ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ మళ్ళీ పడింది. ఇవాళ మరో 13 పైసలు క్షీణించి 85.65కి క్షీణించింది. దీనివల్ల భారీగా లబ్ది పొదే ఐటీ షేర్లు ఇవాళ కూడా పడ్డాయి. ముఖ్యంగా మన ఐటీ షేర్లు నాస్‌డాక్‌ను ట్రాక్‌ చేస్తున్నారు. గత రెండు సెషన్స్‌లో నాస్‌డాక్‌ రెండు శాతంపైగా నష్టపోయింది. దీంతో న్యూఇయర్‌ పార్టీని ఐటీ షేర్లు దెబ్బతీస్తున్నాయి. గుడ్డిలో మెల్లగా ఫార్మా కౌంటర్లు ఇరగదీస్తున్నాయి. బ్యాంకు షేర్లు కూడా జంకుతున్నాయని స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు అంటున్నారు. ఇవాళ నిఫ్టీ కేవలం 0.10 పాయింట్‌ నష్టంతో 23,644.80 వద్ద ముగిసింది. కాని దిగువస్థాయి నుంచి జబర్దస్త్‌గా కోలుకున్నాయి. అయితే ఈ మొత్తం గేమ్‌లో అనేక మిడ్‌ క్యాప్‌ షేర్లు భారీగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా గాలివాటంగా పెరిగిన షేర్లను కొనేదిక్కు లేడు. ఈనేపథ్యంలో కొత్త ఏడాదిపై ఇన్వెస్టర్లు చాలా ఆసక్తితో ఉన్నారు. ముఖ్యంగా జనవరిలో ప్రి బడ్జెట్‌ ర్యాలీ ఆశిస్తున్నారు. ట్రంప్‌ అధికార పగ్గాలు చేపడితే కొన్ని రంగాలు దూసుకెళతాయని భావిస్తున్నారు. రూపాయి వీక్‌నెస్‌ కారణంగా ఫార్మా, ఐటీ కంపెనీల ఫలితాలు బాగుంటాయని భావిస్తున్నారు. అలాగే రెండో త్రైమాసికంతో పోలిస్తే మూడో త్రైమాసికం ఫలితాలు బాగుంటాయని భావిస్తున్నారు. మరి జనవరిలో డెరివేటివ్స్‌ రోల్‌ఓవర్‌ నిరుత్సాహకరంగా సాగింది. జనవరి కూడా నిఫ్టి వీక్‌గా ఉంటుందని ఇప్పటి వరకు అంచనా. ఐటీ ఫలితాలతో ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశముంది. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఇకనైనా తగ్గుతాయేమో చూడాలి.