For Money

Business News

నిఫ్టి నిలబడుతుందా?

నిఫ్టి ఓపెనింగ్‌లోనే తొలి ప్రతిఘటన స్థాయికి చేరింది. 17601 స్థాయిని తాటిన వెంటనే నష్టాల్లోకి జారుకుని 17,584 స్థాయిని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 32 పాయింట్ల లాభంతో 17,594 వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్‌ నిఫ్టి కూడా స్థిరంగా ఉంది. ఆశ్చర్యకరంగా మిడ్ క్యాప్‌ నిఫ్టి ఏకంగా ఒకశాతం పైగా లాభంతో ట్రేడవుతోంది. దీనికి ప్రధాన కారణం మీడియా షేర్లలో వచ్చిన భారీ ర్యాలీ. జీటీవీ-సోనీ డీల్‌ వార్తలతో మొత్తం మీడియా షేర్లు వెలుగులో ఉన్నాయి. ఫెడ్‌ మీటింగ్‌ ఇవాళ ప్రారంభమౌతుంది. రేపు ముగుస్తుంది. ఫెడ్‌ నిర్ణయం వచ్చేవరకు మార్కెట్‌లో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
హెచ్‌సీఎల్‌ టెక్‌ 1,317.85 1.41
బీపీసీఎల్‌ 419.55 1.39
టెక్‌ మహీంద్రా 1,480.15 1.26 ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1,150.85 1.17
హిందాల్కో 455.90 1.09

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
హెచ్‌డీఎఫ్‌సీ 2,739.25 -1.27
నెస్లే ఇండియా 20,011.20 -0.88
హీరోమోటోకార్ప్‌ 2,828.00 -0.79
శ్రీ సిమెంట్‌ 29,882.25 -0.59
యాక్సిస్‌ బ్యాంక్‌ 791.30 -0.51