NIFTY TRADE: పెరిగితే అమ్మడమే
సింగపూర్ నిఫ్టి స్థాయిలో నిఫ్టి ప్రారంభమౌతుందేమో చూడండి. ఇదే స్థాయిలో ప్రారంభమైతే… నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17900ని తాకే అవకాశాలు అధికంగా ఉన్నాయి. నిఫ్టి క్రితం ముగింపు 18,079. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17950 దిగువకు వెళుతుందేమో చూడండి. నిఫ్టి ఓపెనింగ్ నుంచి ఏమాత్రం పెరిగినా అమ్మడానికి ఛాన్స్‌గా భావించండి. నిఫ్టి 17,950 దిగువకు వెళితే 17,900 వరకు మద్దతు లేదు. ఆ తరవాత 17,880, 17,850 ప్రాంతానికి చేరే అవకాశముంది. ఈ స్థాయికి వస్తే నిఫ్టి బేర్ల చేతిలోకి వచ్చినట్లే. నిఫ్టి ఇంకా ఓవర్ సోల్డ్ జోన్‌లోకి రాలేదు. కాబట్టి భారీ నష్టాల్లో నిఫ్టి ముగుస్తుందా అన్నది చూడాలి. ఎందుకంటే ఆసియా మార్కెట్ల మాదిరే యూరో మార్కెట్లు కూడా స్పందిస్తే నిఫ్టి 17,900పైన నిలబడటం కష్టమే. రేపు వీక్లీ డెరివేటివ్స్ సెటిల్‌మెంట్ ఉంది. కాబట్టి చిన్ని ఇన్వెస్టర్లు మార్కెట్‌కు దూరంగా ఉండటం మంచిది.