For Money

Business News

NIFTY TODAY: 16324 నిలబడేనా?

సాంకేతికంగా సూచీలు చాలా బలహీనంగా ఉన్నాయని గత కొన్ని రోజుల నుంచి విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రతి రోజూ డే లెవల్స్‌ చూసి.. ఏరోజుకు ఆరోజు ట్రేడింగ్‌ చేసుకునేవారికి మినహా… పొజిషనల్‌ ట్రేడర్స్‌కు నిఫ్టి పీడకలగానే ఉంది. 16700 ప్రాంతంలో నిఫ్టి తీవ్ర ప్రతిఘటన వస్తోంది. సో… డే ట్రేడింగ్‌కు పరిమితం కావడమే ఉత్తమం. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండటం, డాలర్‌తో పాటు క్రూడ్‌ ధరలు కూడా అధికంగా ఉండటం మన మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటోంది. విదేశీ ఇన్వెస్టర్లు భారీగా మన మార్కెట్‌ నుంచి నిధులు వెనక్కి తీసుకుంటున్నారు. దాదాపు 12 ఏళ్ళలో ఎన్నడూ లేని విధంగా 800 కోట్ల డాలర్ల నిధులను వెనక్కి తీసుకున్నారు. కాబట్టి సూచీలను చూసి సంతృప్తి పడకండి. షేర్ల ధరలు చూడండి. ఇక ఇవాళ్టి ట్రేడింగ్‌ విషయానికొస్తే నిఫ్టి 16340ని కాపాడుకుంటుందా అన్నది చూడాలి. నిన్న వీక్లీ క్లోజింగ్‌ కారణంగా షార్ట్‌ కవరింగ్‌తో నిఫ్టి లాభాల్లో ముగిసింది. కాని ఇవాళ ఏకంగా రెండు మద్దతు స్థాయిలను కోల్పోయే అవకాశముంది. బేర్‌ మార్కెట్‌లో వస్తున్న ర్యాలీ ఇది అని అనిలిస్టులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. ఈ ర్యాలీకి ముగిసినట్లే. నిఫ్టికి 16,000 వద్ద గట్టి మద్దతు లభించవచ్చు.16324 దిగువకు వెళితే బేర్‌ ఫేజ్‌లోకి వెళ్ళినట్లే.

నిఫ్టికి ఇవాళ్టి లెవల్స్‌

అప్ బ్రేకౌట్‌ 16613
రెండో ప్రతిఘటన 16591
తొలి ప్రతిఘటన 16564
నిఫ్టికి కీలకం 16405
తొలి మద్దతు 16393
రెండో మద్దతు 16365
డౌన్‌ బ్రేకౌట్‌ 16324