దిగువస్థాయిలో మద్దతు?
అక్టోబర్ సిరీస్ ఇవాళ నష్టాలతో ప్రారంభం కానుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు స్వల్పంగా తగ్గినా.. బ్రెంట్ ధర ఇంకా 103 డాలర్లపైనే ఉంది. బీమా, రవాణా చార్జీలు అత్యధికంగా ఉన్నందున బ్రెంట్ ధర అధికంగా ఉందని, అమెరికాలో WTI ధర 90 డాలర్లలోపునకు వచ్చేసిందని అనలిస్టులు అంటున్నారు. దీంతో ఈ రెండింటి మధ్య వ్యత్యాసం 12 డాలర్లకు చేరింది. సాధారణంగా ఈ వ్యత్యాసం 4 డాలర్లు ఉంటుంది. మరోవైపు డాలర్ ఇండెక్స్ కూడా 101పైనే ఉంటోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు నష్టాలతో ప్రారంభం కానున్నాయి. మార్కెట్‌కు అండగా నిలిచే పాజిటివ్ సంకేతాలు ఏవీ లేవు. కేవలం దిగువస్థాయిలో మద్దతు లభిస్తుందేమో అని ఎదురు చూడటం తప్ప. CAS ఇప్పటికీ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపుతోంది. మంత్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ సందర్భంగా నిన్న చివర్లో నిఫ్టి ఏకంగా 2.25 శాతం క్షీణించింది. ఆ వెంటనే కోలుకుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఇన్వెస్టర్లకు అర్థం కావడం లేదు. బడా ఇన్వెస్టర్లు తమ పొజిషన్స్‌కు అనుగుణంగా నిఫ్టిని పెంచడం, తగ్గడం చేస్తున్నారని ఆపరేటర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై సెబీ నుంచి ఇంకా క్లారిటీ రావడం లేదు. ఎఫ్‌అండ్ ఓకు చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్లు గుడ్ బై చెబుతున్నారు. ఎన్నడూ లేని కనిష్ఠ స్థాయికి టర్నోవర్ పడిపోతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టి బలహీనంగా ఉంటోంది. మార్కెట్‌కు అండగా నిలిచే రంగాల్లో ఫార్మా తప్ప మరో రంగం కన్పించడం లేదు. ఎంపిక చేసిన కొన్ని షేర్లు వినా… మిగిలిన షేర్లపై ఎవరూ ఆసక్తి చూపడం లేదే. కేవలం న్యూఏజ్ షేర్లలోనే యాక్టివిటీ కన్పిస్తోంది. ఏఐ సంబంధిత రంగాల షేర్లనే ఇన్వెస్టర్లు కొంటున్నారు. ఈ రంగానికి చెందిన ఐపీఓలకు కూడా భారీ స్పందన వస్తోంది. హైదరాబాద్‌కు చెందిన స్టాండర్డ్ ఇంజినీరింగ్ రూ. 400 వద్ద చాలా బలంగా ట్రేడవుతోంది. బొందాడ ఇంజినీరింగ్ స్థిరంగా ఉన్నా… ఏమాత్రం పెరిగినా ఒత్తిడి వస్తోంది. ఇక అపోలో మైక్రో నిన్న కూడా చాలా గట్టిగా ఉంది. రూ. 400 దిగువకు ఈ కౌంటర్‌కు మద్దతు లభిస్తోంది. ఇక క్యాప్‌స్టన్ సాలిడ్‌గా ఉండటమే గాక… తగ్గితే వెంటనే మద్దతు వస్తోంది. అలాగే ఎస్‌ఎంఎస్ ఫార్మా కూడా ఓకే. మాస్‌చిప్ రూ.200 వద్ద కొన్ని నెలలుగా ట్రేడవుతోంది. దిగువకు ఈ షేర్‌కు ఎంత మద్దతు లభిస్తోందో… పెరిగితే అంతే స్థాయి ఒత్తిడి కూడా వస్తోంది. ఇండ్ ఎంఐఎం కూడా ఈ గడ్డు పరిస్థితుల్లో రాణిస్తోంది. స్థానిక ఫార్మా కౌంటర్లన్నీ బలంగా ఉన్నాయి.జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్‌లో వారెంట్ల కన్వర్షన్ అయిపోయింది. ఈక్విటీ ఒక శాతం మేర పెరగనుంది. ఈ షేర్‌ను కొనాల్సిందిగా పలు రీసెర్చి సంస్థలు సలహా ఇస్తున్నాయి. ఇవాళ కూడా రూ.121 టార్గెట్‌తో ఈ షేర్‌ను కొనాలని సిటీ సిఫారసు చేసింది.
