NIFTY TRADE: 17170 కీలకం
బుల్స్ అండ్ బేర్స్ మధ్య జరుగుతున్న యుద్ధంలో.. ఇద్దరూ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారని అంటున్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ వీరేందర్. 17,400 వద్ద కాల్ రైటింగ్ జోరుగా ఉంటే 17000 వద్ద పుట్ రైటింగ్ అంతే జోరుగా ఉందని ఆయన చెబుతున్నారు. నిఫ్టికి 17,070 ప్రాంతంలో గట్టి మద్దతు రావాల్సి ఉందని, లేనిపక్షంలో సునాయాసంగా నిఫ్టి 17,000ని బ్రేక్ చేస్తుందని అన్నారు. ఈ వారం మంత్లి డెరివేటివ్స్ క్లోజింగ్ ఉంది. వీక్లీ డెరివేటివ్స్‌లో పెద్దగా అమ్మకాల ఒత్తిడి ఉండదు. కాని మంత్లీ డెరివేటివ్స్ క్లోజింగ్‌లో అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంటుందని వీరేందర్ అంటున్నారు. నిఫ్టికి ఇవాళ 17,210 లేదా 17,177 వద్ద మద్దతు లభించవచ్చని అంటున్నారు. ఈ సపోర్ట్ లెవల్స్‌కు దిగువకు నిఫ్టి వస్తే 17,087 వద్ద లేదా 17,040 వద్ద మద్దతు ఉంటుందని అంటున్నారు. ఇక ఎగువస్థాయిలో 17,320 లేదా 17,361 పాయింట్ల వద్ద నిఫ్టికి ప్రతిఘటన ఎదురుకానుంది. ఇతర లెవల్స్‌కు వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=oMTgx0Y8OTE