For Money

Business News

NIFTY TODAY: దిగువ స్థాయిలో మద్దతు?

ఉదయం వంద పాయింట్ల లాభంలో ఉన్న సింగపూర్‌ నిఫ్టి ఇపుడు దాదాపు లాభాలు కోల్పోయింది. పెట్రోల్‌, డీజిల్ ధరలు తగ్గించడంతో పాటు స్టీల్‌, సిమెంట్, ప్లాస్టిక్‌ రంగాలపై కేంద్రం విధించిన ఆంక్షలు కూడా ఇవాళ మార్కెట్‌ తీవ్రంగా స్పందించనుంది. కేంద్రం చర్యలతో కొన్ని షేర్లు దెబ్బతినే అవకాశముంది. కొన్నింటికి బూస్ట్‌ కానుంది. బ్యాంక్‌, ఆటో షేర్లకు పాజిటివ్‌ కాగా, స్టీల్‌ కంపెనీలకు నెగిటివ్‌గా మారనుంది. ఇవాళ నిఫ్టి స్థిరంగా ప్రారంభమైనా… దిగువ స్థాయిలో నిఫ్టికి మద్దతు లభించే అవకాశముంది. అమెరికా ఫ్యూచర్స్‌ గ్రీన్‌లో ఉన్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగే పక్షంలో నిఫ్టికి దిగువస్థాయిలో మద్దతు అందే అవకాశముంది. మార్కెట్‌ రికవరీ ప్రారంభం కాలేదని, మార్కెట్‌ ఇంకా బేర్‌ మూడ్‌లో ఉందని అనలిస్టులు అంటున్నారు. నిఫ్టికి ఇవాళ్టి లెవల్స్‌…

అప్‌ బ్రేకౌట్‌ : 14549
రెండో ప్రతిఘటన : 16459
తొలి ప్రతిఘటన : 16416
నిఫ్టికి కీలక స్థాయి : 16120
తొలి మద్దతు : 16117
రెండో మద్దతు : 16064
డౌన్‌ బ్రేకౌట్‌ : 15984