For Money

Business News

NIFTY TODAY: 17170 కీలకం

టెక్నికల్‌గా నిఫ్టికి డౌన్‌ బ్రేకౌట్‌ 17170 దిగువన ప్రారంభం కానుంది. సింగపూర్‌ నిఫ్టి స్థాయి నష్టాలతో నిఫ్టి ప్రారంభమైతే… ఈ స్థాయికి గండి పడినట్లే. నిఫ్టికి 17290 అత్యంత కీలకం. నిఫ్టి క్రితం ముగింపు 17,276. సింగపూర్‌ నిఫ్టి ప్రకారం నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17200 స్థాయిని కోల్పోనుంది. 17190ని కోల్పోతే నిఫ్టికి అత్యంత విషమ పరీక్ష 17170 వద్ద ప్రారంభం కానుంది. ఈ స్థాయిని కోల్పోతే మాత్రం నిష్టి భారీ నష్టాలవైపు పయనం ప్రారంభించినట్లే. అయితే ఉక్రెయిన్‌ భయాలు మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఏ చిన్న పాజిటివ్‌ వార్త వచ్చినా… మార్కెట్‌లో షార్ట్‌ కవరింగ్‌ తీవ్రంగా వచ్చే అవకాశముంది.
ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్‌

అప్‌ బ్రౌకౌట్‌ 17380
రెండో ప్రతిఘటన 17330
తొలి ప్రతిఘటన 17290
నిఫ్టికి కీలకం 17215
తొలి మద్దతు 17190
రెండో మద్దతు 17170
డౌన్‌ బ్రేకౌట్‌ 17170