NIFTY LEVELS: పడితే కొనొచ్చా
నిఫ్టి ఇవాళ 150 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి క్రితం ముగింపు 17,512. ఒకవేళ నిఫ్టి గనుక 17350-300 ప్రాంతానికి వస్తే కొనుగోలు చేయొచ్చని సీఎన్‌బీసీ ఆవాజ్ మేనేజింగ్ ఎడిటర్ అనూజ్ సింఘాల్ అంటున్నారు. సింగపూర్ నిఫ్టి కనిష్ఠ స్థాయిని స్టాప్‌లాస్‌గా ఉంచుకోవచ్చని ఆయన చెప్పారు. లేనిపక్షంలో 17,250ని స్టాప్‌లాస్‌గా పెట్టుకుని కొనుగోలు చేయొచ్చని తెలిపారు. అయితే ఈ ట్రేడ్ కేవలం డే ట్రేడింగ్‌కు మాత్రమే. నిఫ్టి ఇవాళ దిగువ స్థాయిలో నిలబడుతుందా అన్నది చూడాలి. నిఫ్టికి 17421 లేదా 17371 ప్రాంతంలో మద్దతు లభించ వచ్చిన డేటా అనలిస్ట్ వీరేందర్ కుమార్ అంటున్నారు. తరువాతి స్థాయి 17341 వద్ద లభించవచ్చు. (ఈ నిఫ్టి వ్యూహాన్ని వెబ్‌సైట్ దిగువన వీడియోలో చూడగలరు)