NIFTY TODAY: పడితే కొనొచ్చా?
నిఫ్టి ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభం కానుంది. సింగపూర్ నిఫ్టి ప్రకారం మార్కెట్ పడితే… ఓపెనింగ్‌లోనే 17000 స్థాయిని నిఫ్టి కోల్పోనుంది. నిఫ్టి క్రితం ముగింపు 17,277. ఇవాళ వీక్లీ, మంత్లి డెరివేటివ్స్ క్లోజింగ్ ఉన్నందున నిఫ్టిపై ఒత్తిడి అధికంగా ఉండొచ్చు. ఫెడ్ నిర్ణయంతో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు అధికంగా ఉండే అవకాశముంది. ఇవాళ్టి ట్రేడింగ్ విషయానికొస్తే నిఫ్టి ఓపెనింగ్‌లో 17,000 దిగువకు వస్తే 16978 వద్ద మద్దతు ఉంది. 16996ని బ్రేక్ చేస్తే నిఫ్టి ఈ స్థాయికి రావొచ్చు. టెక్నికల్‌గా నిఫ్టి లెవల్స్…
17,076 కీలకం
తొలి మద్దతు 16996
రెండో మద్దతు 16978
16890 బ్రేక్ చేస్తే మార్కెట్ బేర్ ఫేజ్‌లోకి వెళ్ళినట్లే.
పై స్థాయిల్లో ఎక్కడ మద్దతు లభించినా… నిఫ్టి 17128ని దాటితేనే మద్దతు వస్తుంది. చిన్న ఇన్వెస్టర్లు ఇవాళ ట్రేడింగ్‌కు దూరంగా ఉండటం మంచిది.